Ayatollah Ali Khamenei | కన్నీళ్లు పెట్టుకున్న ఖమేని ముగ్గురు కొడుకులు.. కొనసాగుతున్న అంత్యక్రియలు
Ayatollah Ali Khamenei : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేని అంత్యక్రియలు టెహ్రాన్‌లో ఉద్విగ్న వాతావరణంలో కొనసాగుతున్నాయి. తాజాగా ఖమేని అంత్యక్రియల సందర్భంగా ఆయన ముగ్గురు కొడుకులు ఏడుస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
Ayatollah Ali Khamenei : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేని అంత్యక్రియలు టెహ్రాన్‌లో ఉద్విగ్న వాతావరణంలో కొనసాగుతున్నాయి. పలువురు ఖమేని సన్నిహితులు, నేతలు, ప్రజలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఖమేని సన్నిహితుడు, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజాగా ఖమేని అంత్యక్రియల సందర్భంగా ఆయన ముగ్గురు కొడుకులు ఏడుస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఖమేనికి మొజ్తాబాతోపాటు మరో ముగ్గురు కొడుకులున్నారు.
వారు మొస్తాఫా ఖమేని, మెయ్సమ్ ఖమేని, మసౌద్ ఖమేని. వీరు తమ తండ్రి అయతొల్లా ఖమేని అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ తండ్రి శవపేటికను చూసి ముగ్గురూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు ఖమేని కొడుకు, ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని మాత్రం ఈ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. భద్రతా కారణాలరీత్యా ఆయనను ప్రభుత్వం అనుమతించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఖమేని, అతడి కుటుంబ సభ్యుల మృతదేహాలున్న శవపేటికలు టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని గ్రాండ్ మొసాల్లా వద్ద ఉంచారు. అక్కడికి ప్రజలతోపాటు నేతలు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. వారంపాటు సాగనున్న ఖమేని అంత్యక్రియలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. మొదటి రోజు ఈ పేటికల్ని ఇండోర్‌లోనే ఉంచారు. విదేశీ ప్రతినిధులు, ఇరాన్ కీలక నేతలు, అధికారులు వంటి వారికి మాత్రమే నివాళులు అర్పించే అవకాశం దొరికింది.
రెండో రోజు పేటికల్ని బయటకు తీసుకొచ్చి, బహిరంగంగా ఉంచారు. అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాలకు లక్షలాది మంది ఇరాన్ ప్రజలు తరలివస్తు్న్నారు. ఇది దేశ ప్రజల ఐక్యతకు నిదర్శనం అని ఇరాన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 9న ఖమేని అంత్యక్రియలు పూర్తవుతాయి. గత ఫిబ్రవరి 28న అమెరికా జరిపిన దాడిలో ఖమేని, అతడి కుటుంబ సభ్యులు మరణించారు. ఖమేని కూతురు, అల్లుడు, 14 నెలల మనవరాలు, కోడలు కూడా ఉంది. వీరందరికీ ఒకేసారి అంత్యక్రియలు జరుగుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

