Iran | ఇరాన్ (Iran)లో కొనసాగుతున్న నిరసనల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 648 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. దాదాపు 10 వేల మందిని సైన్యం అరెస్ట్ చేసినట్లు అమెరికాకు చెందిన ఓ సంస్థ తెలిపింది.
మరోవైపు అమెరికాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమేనని ఇరాన్ తాజాగా ప్రకటించింది. యుద్ధానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని తెలిపింది. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు జరుగుతున్న ఇరాన్లో ఒక్క నిరసనకారుడిని హతమార్చినా తాము సైనిక జోక్యం చేసుకుంటామని పదే పదే హెచ్చరికలు జారీచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంతో సంప్రదింపులను ఇరాన్ నాయకత్వం కోరుకుంటున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ టెహ్రాన్‌లో విదేశీ రాయబారుల సదస్సులో ప్రసంగిస్తూ ఇస్లామిక్ రిపబ్లిక్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కాని యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు.
Also Read..
US Visas: 2025లో లక్ష వీసాలు రద్దు చేసిన అమెరికా
Trump Tariffs | ఇరాన్ ట్రేడింగ్‌పై ట్రంప్ టారిఫ్ బాదుడు.. భారత్‌పై మరో 25 శాతం సుంకం తప్పదా?
Trump Tariffs | ఇరాన్ సంక్షోభం వేళ.. ట్రంప్ కీలక నిర్ణయం