Goldmine Collapses | పశ్చిమ ఆఫ్రికా (West Africa) దేశమైన మాలి (Mali)లో ఘోర ప్రమాదం సంభవించింది. కెనీబా జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బంగారు గని (Goldmine) కూలి 48 మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయపడ్డారు.
డాబియా కమ్యూన్లోని బిలాలీ టోకో వద్ద శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. చైనాకు చెందిన వారు ఈ గోల్డ్ మైన్‌ను నడుపుతున్నారని.. మట్టిపెళ్లలు విరిగిపడడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటైన మాలి ఆఫ్రికాలో అగ్రగామి బంగారు ఉత్పత్తిదారుల్లో ఒకటి. బంగారంతోపాటు ఇక్కడ ఇనుప ఖనిజం, మాంగనీస్, లిథియం, యురేనియం వంటి సహజ వనరులు సమృద్ధిగా దొరుకుతాయి. ఈ ప్రాంతం చైనీస్ పెట్టుబడిదారులకు ఆకర్షనీయమైన గమ్యస్థానంగా ఉంది.
Also Read..
Elections | భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం.. ఓటింగ్ శాతం పెంచేందుకు భారీగా నిధులు!
Cancer | బిడ్డ గర్భంలో ఉండగానే.. క్యాన్సర్‌ను గుర్తించొచ్చు!
AI | ఏఐతో జ్ఞాన హీనులవుతున్నామా? కృత్రిమ మేధపై అధ్యయనంలో ఆసక్తికర అంశాలు