Cancer | వాషింగ్టన్, ఫిబ్రవరి 16: బిడ్డ గర్భంలో ఉండగానే.. క్యాన్సర్ వ్యాధిని పసిగట్టవచ్చునని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. చాలామందిలో క్యాన్సర్ ఉందన్న సంగతి ఆలస్యంగా బయటపడుతుంది. దీంతో క్యాన్సర్ వ్యాధి ముదిరి, వైద్య చికిత్సకు లొంగని స్థాయికి చేరుకుంటుంది. దీనిపై మిషిగన్‌లోని ‘వాన్ ఆండెల్ ఇన్స్టిట్యూట్’ పరిశోధకులు పలు ప్రయోగాలు జరిపారు.
వీరి అధ్యయనం ప్రకారం, క్యాన్సర్ ముప్పును బిడ్డ జన్మించక ముందే, గర్భంలో పిండం దశలో ఉండగానే గుర్తించవచ్చునని తేలింది. ఎలుకలపై ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడైంది. దీనిపై మరింత లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరముందని పరిశోధకులు తెలిపారు.