Israel strikes | గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) మారణహోమాన్ని (Israel strikes) సృష్టిస్తోంది. గాజాలోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్‌కు వెళ్లకుండానే మధ్యప్రాచ్య పర్యటనను ముగించిన తర్వాత ఐడీఎఫ్ తమ దాడులకు మరింత తీవ్రతరం చేసింది. గాజాలోని నివాస ప్రాంతాలు, ఆసుపత్రులపై విరుచుకుపడుతోంది. గత 24 గంటల్లో గాజా అంతటా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియన్లు (Palestinians) మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Gaza Health Ministry) తెలిపింది. దాదాపు 208 మంది గాయపడినట్లు పేర్కొంది.
కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. ఈ గాజా పోరు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటింది. ఈ యుద్ధంలో 54,510 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సుమారు 1,24,901 మంది గాయపడినట్లు పేర్కొంది. హమాస్‌ను అంతమొందించి ఆ ఉగ్రసంస్థ చెరలో ఉన్న బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ సేనలు తెలిపాయి.
గాజాస్ట్రిప్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గాజాస్ట్రిప్‌ను సంపూర్ణంగా స్వాధీనం చేసుకునే వరకు ఇజ్రాయిల్ వెనుకడుగు వేయబోదన్నారు. గాజాస్ట్రిప్ వద్ద భీకర పోరు సాగుతోందని, దాంట్లో ప్రగతి సాధిస్తున్నట్లు ఆయన చెప్పారు. గాజాస్ట్రిప్ ఏరియాను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. విజయం సాధించాలంటే ఆ దిశగానే ప్రయత్నాలు సాగించాల్సి ఉంటుందన్నారు.
Also Read..
Arrest | నేపాల్‌లో ఎయిర్‌పోర్టులో డ్రగ్స్‌తో పట్టుబడ్డ భారత పౌరుడు
Australia: ఆస్ట్రేలియాలో భార్యాభర్తల గొడవ.. గౌరవ్‌పై పోలీసుల దాడి.. ఐసీయూలో భర్త
TikTok Star: 17 ఏళ్ల పాకిస్థానీ టిక్‌టాక్ స్టార్ కాల్చివేత