ఇస్లామాబాద్: టిక్‌టాక్ స్టార్(TikTok Star), 17 ఏళ్ల అమ్మాయి సానా యూసుఫ్.. పాకిస్థాన్‌లో హత్యకు గురైంది. ఇస్లామాబాద్‌లోని తన ఇంట్లోనే ఆమెను కాల్చి చంపారు. సోమవారం ఈ మర్డర్ జరిగింది. దీన్ని పరువు హత్యగా భావిస్తున్నారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెను కాల్చేశాడు. తుపాకీతో షూట్ చేసిన తర్వాత అతను అక్కడ నుంచి పరారీ అయ్యాడు. ఖైబర్ ఫక్తున్‌క్వా ప్రావిన్సులోని చిత్రాల్ ఆమె సొంతూరు. టిక్‌టాక్ వీడియోల ద్వారా ఆమె చాలా పాపులర్ అయ్యారు. ఇంటిగా అతిథిగా వచ్చని వ్యక్తే ఆమెను హతమార్చినట్లు స్థానిక పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇస్లామాబాద్‌లోని సెక్టార్ జీ13లో ఆమె నివాసం ఉంటోంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.