Boat Capsizes | తూర్పు ఆఫ్రికా దేశమైన మొజాంబిక్ (Mozambique)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారతీయులతో వెళ్తున్న ఓ బోటు బోల్తాపడింది (Boat Capsizes). ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటనను మొజాంబిక్‌లోని భారత హైకమిషన్ (Indian High Commission) ధృవీకరించింది.
సముద్రంలో లంగరు వేసిఉన్న ఓ ఆయిల్ ట్యాంకర్‌లోకి సిబ్బందిని తరలించేందుకు 14 మంది భారతీయులతో ఓ బోటు బయల్దేరింది. బీరా పోర్టు సమీపంలో సిబ్బంది బదిలీ ప్రక్రియ జరుగుతండగా.. ప్రమాదవశాత్తూ బోటు బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు మృతి చెందగా.. ఐదుగురు గల్లంతయ్యారు. మరో ఆరుగురిని అధికారులు రక్షించారు. ఈ విషయాన్ని మొజాంబిక్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసింది. మరోవైపు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read..
Air Pollution | ఢిల్లీలో అధ్వాన స్థితికి వాయు కాలుష్యం
Fire | గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం