Boat Accidents | మధ్య ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో పెను విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో (Boat Accidents) దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ వ్యక్తులు గల్లంతయ్యారు. వాయువ్య కాంగోలోని ఈక్వెటర్ ప్రావిన్స్ (Equateur province)కు దాదాపు 150 కిలోమీటర్ల (93 మైళ్ల) దూరంలో బుధవారం, గురువారం ఈ ప్రమాదాలు జరిగాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తొలుత సెప్టెంబర్ 10 బుధవారం నాడు బసంకుసు ప్రాంతంలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో దాదాపు 86 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతయ్యారు. రాత్రిపూట ప్రయాణించడం, పడవ సామర్థ్యానికి మించి జనాలు ఉండడంతోనే ప్రమాదం జరిగినట్టు సమాచారం. విషయం తెలిసిన వెంటనే కాంగో నేవీ, తీర ప్రాంత రక్షక దళం సహాయక చర్యలు చేపట్టింది. అయితే, ఈ యాక్సిడెంట్లో కన్నుమూసిన వాళ్లలో విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
ఆ తర్వాత గురువారం సాయంత్రం లుకొలీలా ప్రాంతంలోని (Lukolela territory) కాంగో నదిలో (Congo River) దాదాపు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో పడవ అదుపుతప్పి నదిలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 107 మంది మరణించగా.. ఈ ఘటనలో 146 మంది గల్లంతయ్యారు. సుమారు 209 మందిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. రెండు పడవ ప్రమాదాల్లో 193 మంది మరణించారు.
Also Read..
Ganesh Visarjan | భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి
PM Modi | నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కర్కికి మోదీ శుభాకాంక్షలు
Earthquake: రష్యా ద్వీపకల్పంలో శక్తివంతమైన భూకంపం.. సునామీ వార్నింగ్ జారీ