Manila | ఫిలిప్పీన్స్ (Philippines) రాజధాని మనీలా (Manila)లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవనంలో మంటలు చెలరేగి 11 మందికిపైగా మృతిచెందారు. మనీలాలోని రద్దీగా ఉండే చైనాటౌన్ (Chinatown) జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఓ పాత ఐదంతస్తుల భవనంలో మంటలు వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని దుకాణంలో ముందుగా మంటలు రాజుకుని అవి పై అంతస్తు వరకూ పాకాయి. ఈ ఘటనలో 11 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని.. 14 ఫైర్‌ఇంజన్ల సాయంతో రెండు గంటల పాటూ శ్రమించి మంటలను ఆర్పివేశారు. చనిపోయిన వారిలో సిబ్బందే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఘటనకు గల కారణాలపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై మనీలా మేయర్ హనీ లాకునా స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో పాత భవనాలు భద్రతా నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, గతంలోనూ రాజధాని ప్రాంతంలోని క్యూజోన్ నగరంలో ఓ నైట్ క్లబ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 162 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చాలా మంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటపడి ప్రాణాలను దక్కించుకున్నారు.
Also Read..
Manu Bhaker | ఒలింపిక్స్‌లో సంచలనంతో పెరిగిన మను బాకర్ క్రేజ్.. 40 బ్రాండ్ల నుంచి ఆఫర్
Pune | ఇనుప గేటుపడి మూడేళ్ల చిన్నారి మృతి.. షాకింగ్ వీడియో
Swapnil Kusale | ఒలింపిక్స్‌లో కాంస్యం ముద్దాడిన యువ షూటర్ స్వప్నిల్‌కు లోక్‌సభ అభినందనలు