Manu Bhaker | పారిస్ ఒలింపిక్స్‌లో సంచలనం సృష్టించిన షూటర్ (shooter) మను బాకర్ (Manu Bhaker) క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ విశ్వ క్రీడల్లో మను బాకర్ ఇప్పటికే రెండు పతకాలను గెలిచిన ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న విషయం తెలిసిందే. అంతే కాదు భారత్ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రెండు సార్లూ కాంస్య పతకాన్ని ముద్దాడింది. ఈ నేపథ్యంలో తాజాగా మను బాకర్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది.
విశ్వ క్రీడలో సంచలనం అనంతరం షూటర్‌కు దాదాపు 40 బ్రాండ్ల (40 Brands) నుంచి ఆఫర్ వచ్చినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం మను దృష్టంతా పారిస్ ఒలింపిక్స్ క్రీడలపైనే ఉండగా.. ఆమె టీమ్ ఇప్పటికే రూ.కోట్ల విలువైన రెండు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు సదరు నివేదిక పేర్కొంది. ఇక ప్రస్తుతం మను రేంజ్ కూడా పెరిగింది (Endorsements Increases) . గతంలో బ్రాండ్ ఒప్పందానికి రూ.20 నుంచి రూ.25 లక్షలుగా ఉండేది. ఇప్పుడు ఆ మొత్తం 6 నుంచి 7 రెట్లు పెరిగింది. ఒక్కో డీల్‌కు రూ.1.5 కోట్ల ఛార్జ్ చేస్తున్నట్లు సదరు నివేదిక వెల్లడించింది.
‘కేవలం గత రెండు, మూడు రోజుల్లోనే మమ్మల్ని దాదాపు 40 కంపెనీలు సంప్రదించాయి. ప్రస్తుతం మేము లాంగ్ టర్మ్ అసోసియేషన్ డీల్స్‌పైనే దృష్టి పెడుతున్నాము. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నాము. ఇక ఇప్పుడు మను బ్రాండ్ విలువ కూడా ఐదు నుంచి ఆరు రెట్లు పెరిగింది. గతంలో రూ.20 నుంచి రూ.25 లక్షల వరకూ ఉండేది. ఇప్పుడు అది రూ.1.5 కోట్లకు చేరుకుంది’ అని స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సీఈవో నీరవ్ థోమర్ తెలిపారు.
Also Read..
Pune | ఇనుప గేటుపడి మూడేళ్ల చిన్నారి మృతి.. షాకింగ్ వీడియో
Hoarding Collapsed | థానేలో కూలిన హోర్డింగ్.. వాహనాలు ధ్వంసం
Swapnil Kusale | ఒలింపిక్స్‌లో కాంస్యం ముద్దాడిన యువ షూటర్ స్వప్నిల్‌కు లోక్‌సభ అభినందనలు