గ్రీన్వుడ్, ఆగస్టు 13: అమెరికాలో మరోసారి హిందూ దేవాలయంపై ఖలిస్థానీ అతివాదులు దాడి చేశా రు. గ్రీన్వుడ్లో ఉన్న బీఏపీఎస్ దేవాలయం గోడలపై కొందరు ఖలిస్థాన్ మద్దతుదారులు భారత్‌కు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. యూఎస్‌లోని బీఏపీఎస్ దేవాలయంపై ఇలా దాడి చేయడం ఏడాది వ్యవధిలో ఇది నాలుగోసారి. ఈ విద్వేషపూరిత దాడిని ద హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్), ఉత్తర అమెరికా హిందువుల సంఘం తీవ్రంగా నిరసించాయి. దాడికి పాల్పడిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరాయి. ఈ ఘటనను భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించారు.