Earthquake | వరుస భూకంపాలతో మయన్మార్ (Myanmar) వణికిపోతున్నది. శుక్రవారం మధ్యాహ్నం 12 నిమిషాల వ్యవధిలో 7.7, 6.4 తీవ్రతతో రెండుసార్లు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదయ్యాయి. తాజాగా ఇవాళ మరోసారి అక్కడ భూ ప్రకంపనలు (Earthquake) నమోదయ్యాయి. శనివారం మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం) 4.7 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది.
EQ of M: 4.7, On: 29/03/2025 14:50:55 IST, Lat: 19.94 N, Long: 95.96 E, Depth: 10 Km, Location: Myanmar.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/qgbxLXXQY1— National Center for Seismology (@NCS_Earthquake) March 29, 2025
అయితే, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) మాత్రం భూకంపం తీవ్రతను 5.1గా పేర్కొంది. మయన్మార్ రాజధాని నేపిడా సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. మరోవైపు వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం సమయంలో మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలను శక్తిమంతమైన భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. మయన్మార్‌లో నిమిషాల వ్యవధిలోనే 7.7, 6.4 తీవ్రతతో భారీ భూకంపాలు సంభవించాయి. ఆ తర్వాత థాయ్‌లాండ్‌లో 7.3 తీవత్రతో భూమి కంపించింది. ఈ విపత్తులో రెండు దేశాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. రోడ్లు, వంతెనలు, ఎయిర్‌పోర్ట్‌లు, ఇల్లు దెబ్బతిన్నాయి. అనేక భవనాలు నేలకూలాయి.
ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. రెండు దేశాల్లో మరణాల సంఖ్య వెయ్యి దాటింది. మయన్మార్‌లో కనీసం 1002 మంది మరణించినట్లు మయన్మార్ మిలిటరీ (Myanmar military) అధికారులు ఈ ఉదయం ఓ ప్రకటనలో వెల్లడించారు. మరో, 2376 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. బ్యాంకాక్ (Bangkok)లో 10 మంది మరణించగా.. ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. అయితే రెండు దేశాల్లో మరణాల సంఖ్య 10 వేలు దాటే అవకాశం ఉన్నదని అమెరికా ఏజెన్సీ అంచనావేసింది.
Also Read..
Myanmar | మయన్మార్‌కు ఆపన్నహస్తం.. 15 టన్నుల సహాయ సామగ్రిని పంపిన భారత్
Bangkok | భూకంపం సమయంలో పురిటినొప్పులు.. గర్భిణికి పార్క్‌లో డెలివరీ చేసిన వైద్యులు
Myanmar | మయన్మార్‌లో 1000 దాటిన మరణాల సంఖ్య.. 2 వేల మందికిపైగా గాయాలు