Earthquake | నేపాల్‌లో మళ్లీ కంపించిన భూమి.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
Earthquake | నేపాల్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. ఇవాళ (ఆదివారం) ఉదయం 7.24 గంటలకు ఈ భూకంపం చోటుచేసుకుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. నేపాల్ రాజధాని ఖాట్మండుకు సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
ఖాట్మండు: నేపాల్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. ఇవాళ (ఆదివారం) ఉదయం 7.24 గంటలకు ఈ భూకంపం చోటుచేసుకుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. నేపాల్ రాజధాని ఖాట్మండుకు సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
ఈ భూకంపం వల్ల ఏమైనా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందా..? లేదంటే ఎలాంటి నష్టం జరగలేదా..? అనే వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ నెల తొలి వారంలో కూడా నేపాల్‌ను వరుస భూకంపాలు గడగడలాడించాయి. కేవలం అరగంట వ్యవధిలో ఐదుసార్లు భూమి కంపించి నేపాల్‌లో పెను విషాదం నింపింది.
తీవ్ర భూకంపాల ధాటికి నేపాల్‌లో పలు భవనాలు కుప్పకూలాయి. ఆ కూలిన భవన శిథిలాలను తొలగిస్తుంటే కుప్పలు తెప్పలుగా శవాలు బయటపడ్డాయి. మొత్తం మృతుల సంఖ్య 3,600 దాటింది. వేల మంది గాయపడ్డారు. ఆ విషాద ఛాయలు ఇంకా వీడక ముందే మళ్లీ భూకంపం చోటుచేసుకోవడం నేపాలీలను ఆందోళనకు గురిచేస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

