వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదటి ఫలితం వచ్చింది. న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలోని డాక్స్విల్లె నాచ్ అనే చిన్న గ్రామంలో సోమవారం అర్ధరాత్రే పోలింగ్ జరిగింది. ఈ గ్రామంలో కేవలం ఆరుగురు ఓటర్లే ఉన్నారు. పోలింగ్ ముగిసిన నిమిషాల్లోనే ఫలితం వెలువడింది. ఆరు ఓట్లలో మూడు డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు, మూడు ఓట్లు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌నకు దక్కాయి.
డాక్స్విల్లె నాచ్‌లో ప్రతిసారి త్వరగా ఫలితాలు వెలువడతాయి. ఇక్కడి ఫలితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపును అంచనా వేస్తుందనే అభిప్రాయం ఉంటుంది. ఈసారి మాత్రం ఇక్కడ ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడం ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠను మరింత పెంచింది.