శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 19, 2020 , 18:25:41

అఫ్ఘాన్‌లో వైమానిక దాడులు.. 30 మంది మృతి!

అఫ్ఘాన్‌లో వైమానిక దాడులు.. 30 మంది మృతి!

కాబూల్: అఫ్ఘానిస్థాన్‌లో దారుణం జ‌రిగింది. ఈశాన్య రాష్ట్ర‌మైన కుందుజ్‌లోని తాలిబ‌న్ స్థావ‌రంపై వెంట‌వెంట‌నే జంట వైమానిక దాడులు జ‌రిగాయి. అయితే, ఈ దాడుల్లో 30 మంది సాధార‌ణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. స్పుత్నిక్ ప‌త్రిక ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. కుందుజ్ రాష్ట్రం ఖ‌న్న‌బాద్ జిల్లా నిక్‌పాయ్ ఏరియాలోని తాలిబ‌న్ స్థావ‌రంపై ముందుగా ఒక వైమానిక దాడి జ‌రిగింది. దీంతో జ‌నం పెద్ద ఎత్తున అక్క‌డ గుమిగూడారు. స‌రిగ్గా అప్పుడే మ‌రో వైమానిక దాడి జ‌రుగడంతో 30 మంది పౌరులు మృతిచెందారు. 

కాగా, ఈ దాడిలో 12 మంది పౌరులు మాత్ర‌మే మృతిచెందార‌ని, మ‌రో 18 మందికి తీవ్ర గాయాల‌య్యాయ‌ని ప్ర‌త్య‌క్ష‌సాక్ష్యులు చెప్పారు. ఏడుగురు తాలిబ‌న్‌లు కూడా ఈ దాడిలో హ‌త‌మ‌య్యార‌ని, మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డార‌ని తెలిపారు. వైమానిక దాడుల‌ గురించి ఖ‌న్న‌బాద్ జిల్లా చీఫ్‌ను ప్ర‌శ్నించ‌గా దాడులు జ‌రిగింది వాస్త‌వ‌మేన‌ని చెప్పారు. అయితే, ఆ దాడుల్లో ఎంత‌మంది మ‌ర‌ణించారు, ఎంతమంది గాయ‌ప‌డ్డారు, అస‌లు దాడులు చేసింది ఎవ‌రు అనే విష‌యాన్ని వెల్ల‌డించేందుకు ఆయ‌న నిరాక‌రించారు. ‌        

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo