Dense Fog | అమెరికా (America) లో పొగమంచు (Dense Fog) కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై డజన్ల కొద్దీ వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి (vehicles crash). ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఇడాహో (Idaho) రాష్ట్రంలోని పొక్టాటెల్లో (Pocatello)లోని ఇంటర్‌స్టేట్ 86 రహదారిపై సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. సుమారు 30 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నట్లు చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన ఓ వ్యక్తిని అంబులెన్స్ సాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన అత్యవసర సిబ్బంది అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం రోడ్డును క్లియర్ చేసేందుకు సుమారు 7 గంటల సమయం పట్టినట్లు వారు వెల్లడించారు.
Also Read..
స్టెమ్‌సెల్ చికిత్సతో డయాబెటిస్‌కు చెక్
Platinum Mine | ప్లాటినం గనిలో ఎలివేటర్ కూలి 11 మంది మృతి