Platinum Mine | ప్లాటినం గనిలో ఎలివేటర్ కూలి 11 మంది మృతి
Platinum Mine | దక్షిణాఫ్రికా (South Africa)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్లాటినం గని (Platinum Mine)లో ఎలివేటర్ (Elevator) కూలి 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
Platinum Mine | దక్షిణాఫ్రికా (South Africa)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్లాటినం గని (Platinum Mine)లో ఎలివేటర్ (Elevator) కూలి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.
రస్టెన్‌బర్గ్ (Rustenburg)లోని ఇంపాలా ప్లాటినం హోల్డింగ్స్ (Impala Platinum Holdings – Implats) లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గని ఆపరేటర్ మంగళవారం తెలిపారు. కార్మికులు విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో ఎలివేటర్ అకస్మాత్తుగా 200 మీటర్ల (656 అడుగులు) కిందకు పడిపోయిందని తెలిపారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. సుమారు 75 మంది గాయపడినట్లు చెప్పారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఎలివేటర్ పడిపోవడానికి గల కారణమేమిటన్నదానిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రమాదం నేపథ్యంలో గనిలో మంగళవారం అన్ని కార్యకలాపాలను నిలిపివేసినట్లు తెలిపారు. మరోవైపు ఘటనపై ఇంప్లాట్స్ సీఈవో నికో ముల్లర్ ( Implats CEO Nico Muller) స్పందించారు. ‘ఇంప్లాట్స్ చరిత్రలో ఇదో చీకటి రోజు’ అంటూ ప్రకటనలో తెలిపారు.
Also Read..
Uttarakhand Tunnel: 41 మంది కార్మికుల కోసం.. 41 అంబులెన్సులు.. 41 ఆక్సిజన్ బెడ్స్ రెడీ..
Malla Reddy | వచ్చే ఐదేళ్లలో హాలీవుడ్, బాలీవుడ్‌ను తెలుగు ప్రజలే శాసిస్తారు : మంత్రి మల్లారెడ్డి
Malla Reddy | మహేశ్‌బాబు బిజినెస్‌మ్యాన్ సినిమా చూసే రాజకీయాల్లోకి వచ్చా : మల్లారెడ్డి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

