Indus Water Treaty | తీవ్ర ఉద్రిక్తతల వేళ భారత్‌పై పాక్ అధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉగ్రవాద తరహాలో తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. తాజాగా పాక్‌కు చెందిన ఓ ఆర్మీ అధికారి (Pakistani military spokesperson) భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల నీటిని అడ్డుకుంటే భారత ప్రజల ఊపిరి తీస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంతో చేసుకున్న సింధు జలాల ఒప్పందం (Indus Water Treaty) అమలును మన దేశం నిలిపివేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి (Ahmed Sharif Chaudhry) తాజాగా మాట్లాడారు. పాక్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మాకు వచ్చే నీటిని భారత్ అడ్డుకుంటే అక్కడి ప్రజల ఊపిరి ఆపేస్తాం. సింధూ నదిలో (Indus River) జలాలకు బదులుగా వారి రక్తం పారుతుంది’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అహ్మద్ షరీఫ్ చౌదరి వ్యాఖ్యలు.. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయూద్ (Hafiz Saeed) వ్యాఖ్యలకు అద్దం పడుతోంది.
A spokesperson for the Pakistani military issued a warning to India regarding the suspension of the Indus Water Treaty,
quoting terrorist Hafiz Saeed with the statement: ‘If you cut off our water, we will cut off your breath.’
pic.twitter.com/hl45IPfLVM— Harsh Patel (@Harshpatel1408) May 23, 2025
‘మీరు నీటిని ఆపేస్తే.. మేము మీ శ్వాసను ఆపేస్తాం. ఆపై సింధు నదిలో రక్తం పారుతుంది’ అని గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే పాక్ ఆర్మీ అధికారి చేయడం గమనార్హం. మరోవైపు సింధూ నదీ వ్యవహారంలో భారత ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి గట్టిగా బదులిస్తామని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మెన్ బిలావల్ భుట్టో (Bilawal Bhutto) ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత్ తన నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకున్నట్లు ఆయన ఖండించారు. సింధూ జలాలు మావే అని, అవి ఎప్పటికీ మా నీళ్లే అని, ఆ నదిలో మా నీళ్లు అయినా పారాలి లేక మీ రక్తమైనా పారాలని అని బిలావల్ తన వార్నింగ్‌లో పేర్కొన్నారు.
He seems to have copied Lashkr e Taiba’s founder Hafiz Saeed word for word “If India stops the water we will stop their breath” I guess the Pakistani military establishment shares a script with recognized terrorists. 🤷🏻♀️ pic.twitter.com/b6dG4vi4V1
— Mariam Solaimankhil (@Mariamistan) May 22, 2025
Also Read..
Amit Shah | ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి దీటైన జవాబు : అమిత్ షా
IndiGo | గగనతలంలో అల్లకల్లోలం.. ఇండిగో అభ్యర్థనను తిరస్కరించిన పాక్