Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఇటీవలే తనపై దాడి జరిగిన పెన్సిల్వేనియాలో (Pennsylvania) భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో మరో సభకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం బట్లర్ (Butler)కు వస్తున్నానంటూ తనపై కాల్పులు జరిగినప్పటి ఫొటోను ట్రంప్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ట్రంప్ ట్వీట్‌పై ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందించారు. ట్రంప్‌కు మద్దతుగా ఆ సభకు తాను కూడా హాజరవుతానని ప్రకటించారు.
I will be there to support! https://t.co/nokR0g3dn1
— Elon Musk (@elonmusk) October 4, 2024
జూలై 13న అమెరికాలోని పెన్సిల్వేనియాలో చేపట్టిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ వేదికపై మాట్లాడుతూ తనకు కుడివైపున ఉన్న ఓ అక్రమ వలసదారుల గణాంకాలకు సంబంధించిన చార్ట్‌ను చూపిస్తూ అటు వైపు తల తిప్పారు. ఆ తర్వాత దుండగుడు కాల్పులు జరపగా బుల్లెట్ ట్రంప్ చెవిని తాకింది. ఒక వేళ ట్రంప్ అటువైపు తిరగకుంటే బుల్లెట్ నేరుగా తలలోకి దూసుకెళ్లేది. ఇక ఈ కాల్పుల ఘటనలో మాజీ అగ్నిమాపక సిబ్బంది కోరే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన తర్వాత ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తనపై దాడి జరిగిన పెన్సిల్వేనియాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ర్యాలీ కోసం తాను బట్లర్ (Butler)కు తిరిగి వెళ్తున్నట్లు తెలిపారు. ‘ఇటీవలే నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహించబోతున్నాను. నేను మా ప్రియమైన ఫైర్‌ఫైటర్ కోరే గౌరవార్థం ఆయన్ని స్మరించుకుంటూ భారీ ర్యాలీ చేపట్టబోతున్నా. ఇందుకోసం పెన్సిల్వేనియాలోని బట్లర్‌కు తిరిగి వెళ్తున్నాను. ఈ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తా. వివరాల కోసం వేచి ఉండండి’ అని గతంలో తన పోస్ట్‌లో ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.
Also Read..
Elon Musk | ఎక్స్‌లో మస్క్ అరుదైన ఘనత.. ఆ మార్క్‌ను దాటిన మొదటి వ్యక్తిగా రికార్డు
Samantha | దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత.. ఫొటోలు వైరల్