Elon Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) అరుదైన ఘనత సాధించారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. గురువారం నాటికి ఎక్స్‌లో మస్క్ ఫాలోవర్ల సంఖ్య 200 మిలియన్లకు చేరింది (200 million followers). తద్వారా ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో ఈ మార్క్‌ను అందుకున్న మొదటి వ్యక్తిగా మస్క్ (Musk becomes 1st person) రికార్డుకెక్కారు.
మస్క్ తర్వాత ప్రస్తుతం ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ముందున్నారు. ఒబామాకు 131.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక 113.2 మిలియన్ల ఫాలోవర్లతో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మూడో స్థానంలో, 110.3 మిలియన్ ఫాలోవర్లతో ప్రముఖ సింగర్ జస్టిన్ బీబర్ నాలుగోస్థానంలో ఉండగా.. 108.4 మిలియన్ల మంది ఫాలోవర్లతో రిహన్నా ఐదో స్థానంలో నిలిచారు.
ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే 100 మిలియన్ల మార్కును దాటిన విషయం తెలిసిందే. ఈ అరుదైన ఘనతను మస్క్ కూడా ప్రశంసించారు. ప్రస్తుతం ఎక్స్‌లో మోదీ 102.4 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఎక్స్‌కి ప్రస్తుతం 600 మిలియన్ల కంటే ఎక్కువ నెలవారీ యాక్టివ్ యూజర్లు (ఎంఏయూలు), సుమారు 300 మిలియన్ డైలీ యాక్టివ్ యూజర్లు (డీఏయూలు) ఉన్నట్లు ఇటీవలే మస్క్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భూమిపై ‘ఎక్స్’ అనేది గ్రూప్ చాట్‌గా మారిందన్నారు.
Also Read..
Samantha | దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్న సమంత.. ఫొటోలు వైరల్
Rashid Khan | వివాహ బంధంలోకి అడుగుపెట్టిన స్టార్ క్రికెటర్.. ఫొటోలు వైరల్