Mark Zuckerberg | మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Meta CEO) మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా (Second Richest Person In World) నిలిచారు. మొన్నటి వరకూ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఆ స్థానంలోకి జుకర్ బర్గ్ వచ్చి చేరారు.
నాలుగు రోజుల క్రితం విడుదలైన ప్రపంచ సంపన్నుల జాబితాలో మార్క్ జుకర్ బర్గ్ 200 బిలియన్ డాలర్ల నికర సంపదతో నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఇక 265 బిలియన్ డాలర్ల సంపదతో టెస్లా బాస్ ఎలాన్ మస్క్ టాప్ ప్లేస్‌లో నిలివగా.. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. అయితే, తాజాగా విడుదలైన బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గురువారం మెటా ప్లాట్ ఫామ్ షేర్ల విలువ ఒక్కసారిగా పెరగడంతో జుకర్ బర్గ్ నికర ఆస్తుల విలువ పెరిగింది.
దీంతో జుకర్ బర్గ్.. జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టి 206.2 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ సంపన్నుల జాబితాలో రెండో స్థానంలోకి ఎగబాకారు. ఎలాన్ మస్క్ కంటే 50 బిలియన్ డాలర్లు వెనుకబడి ఉన్నారు. మెటా షేర్ల విలువ ఇలాగే పెరిగితే.. అతి తొందర్లోనే మస్క్ స్థానంలోకి జుకర్ బర్గ్ వచ్చి చేరే అవకాశం లేకపోలేదు.
ప్రపంచ వ్యాప్తంగా మెటాకు నెలవారీగా 400 కోట్ల యూజర్లు ఉన్నారు. మెటా కనెక్ట్ 2024 ఈవెంట్లో మార్క్ జుకర్ బర్గ్ స్పందిస్తూ మెటా ఏఐ సెక్సెస్ వల్లే ఆదాయం పెరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ అసిస్టెంట్ వాడకం విస్తృతంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం 500 మిలియన్ల నెలవారీ యూజర్లు పెరిగారని, యూరోపియన్ యూనియన్ వంటి ప్రధాన మార్కెట్లలో మెటా ఏఐ సేవలు ఇంకా ప్రారంభించలేదని చెప్పారు.
Also Read..
Rashid Khan | వివాహ బంధంలోకి అడుగుపెట్టిన స్టార్ క్రికెటర్.. ఫొటోలు వైరల్
Accident | జాతీయ రహదారిపై ఒకదానికొకటి ఢీకొన్న నాలుగు బస్సులు.. డీసీఎం
Telangana | వనపర్తిలో ఇద్దరు కానిస్టేబుళ్లు అదృశ్యం.. ఎంక్వైరీ చేస్తే వెలుగులోకి విస్తుపోయే నిజాలు !