సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఒకదానికొకటి ఐదు వాహనాలు (Accident) ఢీకొన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఆకుపాముల వద్ద ముందు వెళ్తున్న ఓ బస్సు ఒక్కసారిగా ఆగింది. దీంతో వెనుక వస్తున్న బస్సు దానిని ఢీకొట్టింది. ఇలా మరో రెండు బస్సులు, ఓ డీసీఎం ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 80 మంది సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.