Telangana | వనపర్తి, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగాలు చేస్తూ సమాజంలో గౌరవం పొందాల్సి న కొందరు ప్రబుద్దులు అత్యాశకు పోయి బోర్లాపడుతున్నారు. పోలీస్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న పలువురు రియల్ ఎస్టేట్, వైన్స్ తదితర వ్యాపారాల్లో మునిగి తేలారు. బ్యాంకుల్లో తప్పుడు మా ర్గంలో అప్పులు చేయడం నుంచి ప్రైవేట్ వ్యాపారులతోనూ కోట్ల రూపాయలు వడ్డీలకు తెచ్చి తమ నెత్తిమీదకు తెచ్చుకునే వరకు వెళ్లారు. చివరకు చేసిన పనుల బెంగతో ఓ కానిస్టేబుల్ వారం రోజుల కిందట లెటర్ రాసి అదృశ్యమవ్వగా, మ రో కానిస్టేబుల్ హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాల డ్యూటీకి వెళ్లి ఇంటికి రాలేదు.
అటు పోలీస్‌స్టేషన్‌కు చేరుకోకపోవడంతో ఖాకీలు తెరవెనక చేసిన తతంగమంతా గుప్పుమంటుంది. వ నపర్తి జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు చే స్తున్న కొందరు ఆ శాఖ గౌరవం మంటగలిపేలా చేశారు. రియల్ ఎస్టేట్, వైన్స్ వ్యాపారాలకు ఆకర్షితులై చివరకు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం తో పలు కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వచ్చిం ది. జిల్లా పరిధిలోని శ్రీరంగాపురంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రదారిగా నిలుస్తున్నారు.
అయితే, ఇటీవల పాన్‌గల్ మండల కేంద్రంలో పనిచేస్తున్న రామకృష్ణ అనే కానిస్టేబుల్ తాను ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయానని, కుటుంబానికి న్యాయం చేయలేనంటూ ఆవేదనతో మెసేజ్ చేసి కనిపించకుండా పోయా డు. అతని భార్య ఫిర్యాదు చేయడంతో కేసు న మోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, శ్రీరంగాపురం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మరో కానిస్టేబుల్ హైదరాబాద్‌లో రెండు రోజుల వినాయక నిమజ్జనం డ్యూటీకి వెళ్లి ఇంటికి రాకపోగా, స్టేషన్‌కు వెళ్లకపోవడంతో పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించింది.
ప్రభుత్వ ఉద్యోగాలున్నా.. పలువురు ప్రైవేట్ వ్యాపారాల ముసుగులో అనేక దందాలు చేసిన ట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా రియల్ ఎస్టేట్‌ను నడిపించడం, విల్లాల నిర్మాణం, ఇండ్ల పేరుతో బ్యాంకుల రుణాలు, ఒకే ఇంటి పేరుతో రెండు, మూడు రుణాలు, దస్ర్తాల పోర్జరీలు, పోలీ సు శాఖలో అందించే భద్రతా పథకం ద్వారా సొం త శాఖలోనే పలువురు కానిస్టేబుళ్ల పేరుతో రుణా లు తీసుకోవడం, ఒకరికి అమ్మి మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడంలాంటి వాటితో వ్యాపారం బెడిసి కొట్టింది. స్థానికంగా ఎస్బీఐ, కరూర్ వైశ్యబ్యాం క్, ఎస్జీబీ తదితర శాఖల్లో ఇండ్ల పేరుతో, భద్ర తా పథకం పేరుతో రుణాల వ్యవహారం అడ్డగోలు గా సాగినట్లు గుసగుసలున్నాయి.
పోలీసు కొలువుల్లో ఉంటూ వ్యాపారాలకు తె రలేపిన కానిస్టేబుల్ చర్యల వల్ల పట్టణంలో దా దాపు 30 నుంచి రూ.40కోట్లకు పైగా గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో 30కుటుంబాలకు పైగా ఈ వ్యవహారంలో తలదూర్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తున్నది. వీ టిలో కొందరు పోలీసులు నెలవారి రుణాల కం తులు కట్టలేక, ఇండ్లకు డబ్బులిచ్చినా అవి స్వాధీ నం లేక ఇంకొందరు, డబుల్ రిజస్ట్రేషన్లు, డబుల్ రుణాలతో ఇలా బాధితులు లబోదిబోమంటున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా, ఐదేండ్లుగా నడుస్తున్న ఈ వ్యాపార దందాలో చిక్కుకున్న కుటుంబాలన్నీ ఆర్థిక చిక్కుల్లో పడటంతో జిల్లా కేంద్రంలో హాట్ టాఫిక్‌గా మారింది.
సమాజానికి రక్షణగా ఉండాల్సిన కొందరు ఉ ద్యోగులు చేసిన పనుల అపవాదు ఆశాఖ కూడా మోయాల్సి వస్తుంది. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ వ్యవహారంపై పోలీసుశాఖ దృష్టి పెట్టింది. పది రో జులకు పైగా సెలవులో ఉన్న ఎస్పీ ఇటీవలే విధు ల్లో చేరారు. దీంతో సొంత శాఖ ఉద్యోగులు చేసిన ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. బాధిత కుటుంబాల సమాచారం తెలుసుకోవడం, జరిగిన సంఘటనలను పూర్తిగా విశ్లేషించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఇద్దరు కానిస్టేబుళ్లను సైతం సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలను షురూ చేయడంతో జిల్లా పోలీసు శాఖ ఉలిక్కి పడింది.