Fire | చైనాలో (China) ఘోర ప్రమాదం (Fire) చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ హోమ్ (Nursing Home)లో మంటలు చెలరేగి 20 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటన హెబీ ప్రావిన్స్ (Hebei province)లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
చైనా మీడియా నివేదికల ప్రకారం.. రాజధాని బీజింగ్‌కు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగ్డే నగరంలోని లాంగ్హువా కౌంటీ (Longhua County)లో గల ఓ నర్సింగ్ హోమ్‌లో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటల ధాటికి అందులోని వారు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయానికి 20 మందిమృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సుమారు 15 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Panama Canal | పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటాం : పెంటగాన్
Nightclub: నైట్‌క్లబ్ పైకప్పు కూలి 79 మంది మృతి, 160 మందికి గాయాలు
Tahawwur Rana | రేపు ఉదయం భారత్‌కు ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణా