శాంటో డొమింగో: డొమినికన్ రిపబ్లిక్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఓ నైట్‌క్లబ్(Nightclub)లో కన్సర్ట్ జరుగుతున్న సమయంలో.. పైకప్పు కూలింది. రూఫ్ కూలిన ఘటనలో 79 మంది మృతిచెందగా, మరో 160 మంది గాయపడ్డారు. డొమినికన్ రాజధాని శాంటో డొమింగోలో ఈ దుర్ఘటన జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు.
వన్ స్టోర్ జెట్ సెట్ నైట్‌క్లబ్‌లో ఈ ప్రమాదం జరిగింది. రూఫ్ కూలిన 12 గంటల తర్వాత కూడా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నది. కాంక్రీట్ కింద చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది తొలగిస్తున్నది. బాధితుల్లో ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
మోంటోక్రిస్టీ ప్రావిన్సు గవర్నర్ నెల్సీ క్రజ్, బేస్‌బాల్ స్టార్ నీల్సన్ క్రజ్ సోదరి కూడా ఆ రూఫ్ ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. చట్టసభ ప్రతినిధి బ్రే వర్గాస్ ఆ ప్రమాదంలో గాయపడ్డాడు. కన్సర్ట్ నిర్వహిస్తున్న సింగ్ రూబీ పిరేజ్ ఆచూకీ ఇంకా చిక్కలేదు. పిరేజ్ రక్షించినట్లు బంధువులు చెబుతున్నా.. అతని ఆచూకీ లేదని అధికారులు వెల్లడించారు. సంగీత కచేరి ప్రారంభమైన గంట తర్వాత పైకప్పు కూలినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ దుర్ఘటనలో కన్సర్ట్ గ్రూపుకు చెందిన సాక్సోఫోనిస్టు మృతిచెందాడు.
జెట్ సెట్ నైట్‌క్లబ్ కూలి పోవడానికి కారణం ఇంకా తెలియరాలేదు. బహుశా భూకంపం వచ్చిందో ఏమో అని కొందరు ఆ ప్రమాద సమయంలో భావించారు. అయితే అధికారులకు సహకరిస్తున్నట్లు క్లబ్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఆ క్లబ్ ఓనర్ ఆంటోనియో స్పాలియట్ ప్రస్తుతం దేశంలో లేరని తెలిసింది.
🚨World Series champion missing after nightclub ceiling collapse that killed at least 27
Major League Baseball pitcher Octavio Dotel is among dozens of people missing after a roof collapsed and killed 27 at a popular night club in the Dominican Republic.
The incident took place… pic.twitter.com/KVUcK76cn5
— Grifty (@TheGriftReport) April 8, 2025