e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News 94 ఏళ్ల‌కు నెర‌వేరిన బామ్మ క‌ల‌.. వీడియో వైర‌ల్‌

94 ఏళ్ల‌కు నెర‌వేరిన బామ్మ క‌ల‌.. వీడియో వైర‌ల్‌

94 ఏళ్ల‌కు నెర‌వేరిన బామ్మ క‌ల‌.. వీడియో వైర‌ల్‌

ఆ బామ్మది చాలా చిన్న కోరిక ! త‌న పెళ్లికి సొంతంగా గౌను కొనుక్కొని వేసుసుకోవాల‌ని క‌ల‌లు కన్న‌ది !! కానీ అప్ప‌టి ప‌రిస్థితులు వేరు !! గౌను కొనేందుకు డ‌బ్బు సంపాదించినా.. జాతి వివ‌క్ష ఆమెను గౌను కొన‌నివ్వ‌లేదు. దీంతో ఆ బామ్మ క‌ల‌.. క‌ల‌గానే మిగిలిపోయింది. ఆ బామ్మ క‌ల గురించి తెలిసిన ఆమె మ‌న‌వ‌రాలు ఆమె కోరిక తీర్చింది. పెళ్లి గౌను వేసుకుని ఆ బామ్మ మురిసిపోతున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మార్తా మే ఓపేలియా మూన్‌ టక్కర్‌ అనే 94 ఏళ్ల బామ్మ ఇంగ్లండ్‌లోని బ‌ర్మింగ్‌హామ్‌లో నివసిస్తుంది. త‌న పెళ్లిలో తెల్ల‌ గౌను ధ‌రించాల‌ని ఆమెకు చిన్న‌ప్ప‌టి నుంచి ఓ క‌ల ఉండేది. కానీ ఆమె వివాహం జ‌రిగిన స‌మ‌యంలో అంటే 1952లో వారు ఉంటున్న ప్రాంతంలో న‌ల్లజాతీయుల ప‌ట్ల వివ‌క్ష ఎక్కువ‌గా ఉండేది. దీంతో వారిని బ్రైడల్ షాప్స్‌లోకి కూడా అనుమ‌తించేవారు కాదు. దీంతో ఆమె త‌న పెళ్లి రోజున అద్దెకు తీసుకున్న బ‌ట్ట‌ల‌నే వేసుకోవాల్సి వ‌చ్చింది. దీంతో పెళ్లి రోజు సొంతంగా కొనుక్కొని గౌను ధ‌రించ‌లేక‌పోయాననే బాధ మాత్రం ఆమె మన‌సులో అలాగే ఉండిపోయింది. ఆమె బామ్మ బాధ‌ను అర్థం చేసుకున్న త‌న మ‌న‌వరాలు ఏంజెలా.. ఆమె కోరిక‌ను నెర‌వేర్చింది. టక్కర్‌ను బ్రైడల్‌ షాప్‌కు తీసుకెళ్లి తన కోసం ఒక పెళ్లి గౌను కొనిచ్చింది.

- Advertisement -

పెళ్లి గౌను ధరించిన ఆ బామ్మ ఎంతో సంబ‌ర‌ప‌డిపోయింది. ఆ ఆనందంలో కేరింత‌లు కొట్టింది. ఇదంతా వీడియో తీసిన త‌న మ‌న‌వ‌రాలు సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. తమ కోసం తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేసిన బామ్మ కోరిక నెరవేర్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఏంజెలా ఆ పోస్టులో తెలిపింది. పెళ్లి గౌనులో బామ్మను చూసిన నెటిజన్లు ఇంత అందమైన పెళ్లి కూతురిని మా జీవితంలో చూడలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది అప్పటి జాతి వివక్షతను చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

అమెరికా కుబేరుల మ‌ధ్య స్పేస్ వార్.. అంతరిక్షంలోకి వెళ్లే ఛాన్స్‌ కొట్టేసిన తెలుగమ్మాయి

వందేండ్లు కాదు.. 130 ఏండ్లు బతుకొచ్చు అంటున్న శాస్త్ర‌వేత్త‌లు.. అదెలా?

మ‌న న్యాయ‌మూర్తి జ‌పాన్ ప్ర‌జ‌ల‌కు ఎలా దేవుడ‌య్యారు? ఇంత‌కీ ఎవ‌రాయ‌న?

గుర్రాల పెంపకం నుంచి వ్యాక్సిన్ల తయారీ వరకు.. ఇదీ ‘సీరమ్‌’ పూనావాలా ప్రస్థానం

కార్పొరేట్ కొలువులు.. ల‌గ్జ‌రీ లైఫ్ వ‌దిలేసి అడ‌విలో కాపురం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
94 ఏళ్ల‌కు నెర‌వేరిన బామ్మ క‌ల‌.. వీడియో వైర‌ల్‌
94 ఏళ్ల‌కు నెర‌వేరిన బామ్మ క‌ల‌.. వీడియో వైర‌ల్‌
94 ఏళ్ల‌కు నెర‌వేరిన బామ్మ క‌ల‌.. వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్‌

Advertisement