Afghanistan | ఆఫ్ఘనిస్తాన్‌లో మంచు తుఫాన్, భారీ వర్షాలు.. 61 మంది మృతి
Afghanistan : ఆఫ్ఘనిస్తాన్ ను ప్రకృతి వణికిస్తోంది. ఒక పక్క మంచు తుఫాన్, మరో పక్క భారీ వర్షాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి కారణంగా మూడు రోజుల వ్యవధిలోనే 61 మందికిపైగా మరణించారు.
Afghanistan : ఆఫ్ఘనిస్తాన్‌ను ప్రకృతి వణికిస్తోంది. ఒక పక్క మంచు తుఫాన్, మరో పక్క భారీ వర్షాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి కారణంగా మూడు రోజుల వ్యవధిలోనే 61 మందికిపైగా మరణించారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఏఎన్డీఎమ్ఏ) శనివారం వెల్లడించింది.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడు రోజులలో సెంట్రల్, ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లో మంచు తుఫాన్, భారీ వర్షాలు విలయం సృష్టించాయి. వరదలు, మంచు చరియలు విరిగిపడటం, ఇండ్లు కూలిపోవడం వంటి ఘటనల వల్ల దాదాపు 61 మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. 110 మందికిపైగా గాయపడ్డారు. 458 వరకు ఇండ్లు ధ్వంసమయ్యాయి. 360కిపైగా కుటుంబాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. అలాగే అనేక చోట్ల రోడ్లు పాడైపోయాయి. మరోవైపు చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకు పడిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.
మంచు కురిసే ప్రాంతాల్లో ప్రజలు ఇండ్లనుంచి బయటకు రాకూడదని అధికారులు సూచించారు. రోడ్లు కొట్టుకుపోవడం వల్ల చాలా ప్రాంతాలకు రవాణా నిలిచిపోయింది. అనేక ప్రాంతాలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. ఈ దేశానికి విద్యుత్ అందించే ఉజ్బెకిస్తాన్ పవర్ లైన్స్ కూడా కొట్టుకుపోయాయి. ప్రస్తుతం తమకు మానవతా సాయం అవసరమని అక్కడి అధికారులు అంటున్నారు. ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచ దేశాలు స్పందించాలని కోరుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

