బీజింగ్: చైనాలో ఇవాళ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9గా ఉంది. వాయవ్య దిశలో ఉన్న క్విఘాయి రాష్ట్రంలో ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ప్రకంపనలు అధికంగా నమోదు అయినట్లు తెలిపారు. మెన్యువాన్ కౌంటీలో భూమి ఊగిపోయింది. రాత్రి పూట భూమి కంపించడంతో.. జంతువులు పరుగులు తీశాయి. ఆ దృశ్యాలు సీసీటీవీ ఫూటేజ్కు చిక్కాయి. మూడు సార్లు ప్రకంపనలు నమోదు అయినట్లు అధికారులు చెప్పారు. 4.1, 3.0, 5.1 తీవ్రతతోనూ మూడుసార్లు భూమి వణికినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. జినింగ్ నగరానికి 136 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఘాన్సూ, షాంగ్జీ, నింగ్జాయి ప్రావిన్సుల్లోనూ ప్రకంపనలు నమోదు అయ్యాయి.