Earthquake In Japan | జపాన్లో భారీ భూకంపం (Earthquake In Japan) సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం 2:42 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇండ్లలో నుంచిబయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.3గా నమోదైనట్లు జపాన్ మెటరాలజికల్ ఏజెన్సీ (Japan Meteorological Agency) తెలిపింది. సెంట్రల్ జపాన్ (Central Japan) లోని ఇషికావా ప్రిఫెక్చర్ (Ishikawa Prefecture) లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు పేర్కొంది.
సునామీ (Tsunami ) ముప్పు ఏమీ లేదని అధికారులు తెలిపారు. అయితే సముద్ర మట్టంలో 20 సెం.మీ
కంటే తక్కువలో మార్పులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. భూకంపం వల్ల జరిగిన
నష్టానికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. కాగా, నెలరోజు
వ్యవధిలోనే జపాన్లో భూకంపం సంభవించడం ఇది రెండోసారి.
Also Read..
Video | ఉక్రెయిన్ ఎంపీ చేతిలోని జెండాను లాక్కున్న రష్యా ప్రతినిధి.. చావబాదిన ఎంపీ
Brain Surgery | వైద్యరంగంలో అద్భుతం.. గర్భంలోనే శిశువు మెదడుకు సర్జరీ
Meesho Lay Off | ఉద్యోగులకు మీషో మరోసారి షాక్.. 251 మందికి ఉద్వాసన