Meesho Lay Off | సాఫ్ట్‌బ్యాంక్ మద్దతు ఉన్న ఈ-కామర్స్ యూనికార్న్ మీషో (Meesho) మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కంపెనీలో పనిచేస్తున్న 251 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఇది కంపెనీ మొత్తం సిబ్బందిలో 15 శాతానికి సమానం. ఈ మేరకు శుక్రవారం ఉద్యోగులకు అంతర్గత ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందజేసింది.
స్థూల ఆర్థిక పరిస్థితులు సవాల్‌గా మారిన నేపథ్యంలోనే ఉద్యోగుల తొలగింపు తప్పనిసరైనట్లు మీషో సీఈవో (Meesho CEO) విదిత్ ఆత్రే (Vidit Aatrey) తెలిపారు. లేఆఫ్ (Lay Off)కు గురైన ఉద్యోగులకు కంపెనీ (Meesho) తరఫున సహకారం అందిస్తామన్నారు. ఒకేసారి 2.5 నుంచి 9 నెలల వేతనాన్ని పరిహారంగా అందజేస్తామని వెల్లడించారు. ఉద్యోగుల పదవి, పనిచేసిన కాలం, వేతనం ఆధారంగా పరిహార ప్యాకేజీ ఉంటుందని పేర్కొన్నారు. బీమా ప్రయోజనాలను కూడా కొనసాగిస్తామని తెలిపారు. అలాగే కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడంలోనూ సహకరిస్తామని ఆత్రే వెల్లడించారు. కాగా, మీషో తమ ఉద్యోగుల్ని తొలగించడం ఏడాదిలో ఇది రెండో సారి. గతేడాది 150 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
Also Read..
DRDO Scientist Arrest | పాక్‌కు భారత రహస్య సమాచారం లీక్ చేసిన శాస్త్రవేత్త అరెస్ట్
Video | ఉక్రెయిన్ ఎంపీ చేతిలోని జెండాను లాక్కున్న రష్యా ప్రతినిధి.. చావబాదిన ఎంపీ
India Corona | 24 గంటల్లో 3,611 కొత్త కేసులు.. 36 మరణాలు