DRDO Scientist Arrest | పాక్‌కు భారత రహస్య సమాచారం లీక్ చేసిన శాస్త్రవేత్త అరెస్ట్
DRDO Scientist Arrest | దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan)కు భారత రహస్య సమాచారం (Secret Info) అందించిన ఓ శాస్త్రవేత్త (Scientist) తాజాగా అరెస్ట్ అయ్యారు.
DRDO Scientist Arrest | దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan)కు భారత రహస్య సమాచారం (Secret Info) అందించిన ఓ శాస్త్రవేత్త (Scientist) తాజాగా అరెస్ట్ అయ్యారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ( Defence Research and Development Organisation – DRDO) లో పనిచేస్తున్న ఓ శాస్త్రవేత్త వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా భారత్ (India) కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్ ఏజెంట్ (Pakistani agent)కు అందజేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సదరు శాస్త్రవేత్తను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (Maharashtra Anti-Terrorism Squad – ATS) గురువారం అరెస్టు చేసింది.
సదరు శాస్త్రవేత్త పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ఏజెంట్ (Pakistan Intelligence Operative Agent) పన్నిన వలపు వలలో (హనీ ట్రాప్) చిక్కినట్లు ఏటీఎస్ (ATS) అధికారులు తెలిపారు. వారితో నిరంతరం టచ్‌లో ఉంటూ భారత్‌కు సంబంధించిన సీక్రెట్ సమాచారాన్ని అందించినట్లు వెల్లడించారు. ‘తన వద్ద ఉన్న దేశానికి సంబంధించిన రహస్య సమాచారం శత్రువులకు చేరితే దేశభద్రతకు ముప్పు వాటిల్లుతుందని తెలిసినా.. ఆ శాస్త్రవేత్త అధికార దుర్వినియోగానికి పాల్పడి శత్రు దేశానికి వివరాలు అందించాడు’ అని ఏటీఎస్ తన ప్రకటనలో పేర్కొంది.
ఈ మేరకు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్‌తో పాటు ఇతర సెక్షన్ల కింద సదరు శాస్త్రవేత్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏటీఎస్ తెలిపింది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే దానిపై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది. అరెస్టైన శాస్త్రవేత్త ప్రీమియర్ డిఫెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నత పదవిలో ఉన్నట్లు పేర్కొంది.
Also Read..
India Corona | 24 గంటల్లో 3,611 కొత్త కేసులు.. 36 మరణాలు
Video | ఉక్రెయిన్ ఎంపీ చేతిలోని జెండాను లాక్కున్న రష్యా ప్రతినిధి.. చావబాదిన ఎంపీ
SCO Meeting: పాక్ మంత్రికి స్వాగతం పలికిన జైశంకర్.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

