గోవా: గోవాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) మీటింగ్(SCO Meeting) జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ మీటింగ్‌కు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో హాజరయ్యారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆయనకు స్వాగతం పలికారు. చేతులు జోడించి నమస్కరిస్తూ పాక్ మంత్రికి ఆయన వెల్కమ్ పలికారు. వేదిక వద్దకు వచ్చిన పాక్ మంత్రి బిలావల్.. జైశంకర్‌కు నమస్కరిస్తూ కనిపించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు చెందిన విదేశాంగ మంత్రి ఇండియాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లో ఇండియా, పాక్‌కు చెందిన మంత్రులు ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు.
#WATCH | EAM Dr S Jaishankar welcomes Pakistan's Foreign Minister Bilawal Bhutto Zardari for the Meeting of the SCO Council of Foreign Ministers in Goa pic.twitter.com/TVe0gzml1U
— ANI (@ANI) May 5, 2023
ఉగ్రవాదం తీవ్ర స్థాయిలోనూ కొనసాగుతున్నట్లు మంత్రి జైశంకర్ అన్నారు. టెర్రరిజాన్ని ఏ రకంగా ఆమోదించలేమని, దాన్ని అన్ని రకాలుగా ఆపేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని కూడా నిలిపివేయాలని మంత్రి జైశంకర్ అన్నారు. సుమారు 14 అంశాలపై ఎస్సీవో మీటింగ్‌లో నిర్ణయాలు తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు.