Video | టర్కీ (Turkey) రాజధాని అంకారా (Ankara )లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ (Global Meet)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్ ఎంపీ (Ukraine MP ) , రష్యా ప్రతినిధి ( Russian Representative) మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
అంకారా (Ankara )లో జరుగుతున్న బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ (Black Sea Economic Community ) 61వ పార్లమెంటరీ అసెంబ్లీ (61st Parliamentary Assembly) సమావేశాల్లో ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండర్ మారికోవిస్కీ (Oleksandr Marikovskyi) పాల్గొన్నారు. ఇదే సమ్మిట్‌కు పలువురు రష్యా ప్రతినిధులు, ఇతర దేశాధినేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో సమ్మిట్‌లో ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండర్ తమ దేశ జెండాను ప్రదర్శించాడు. ఇది గమనించిన రష్యా ప్రతినిధి ఒకరు ఒలెక్సాండర్ చేతిలోని జెండాను ఒక్కసారిగా లాక్కొని అక్కడి నుంచి పరుగులు తీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఉక్రెయిన్ ఎంపీ.. అతన్ని వెంబడించి పట్టుకున్నాడు. పిడిగుద్దులు గుద్దుతూ రష్యా ప్రతినిధిని చావబాదాడు. అక్కడే ఉన్న ఇతర అధికారులు వీరిని అడ్డుకున్నారు. అనంతరం రష్యా ప్రతినిధి చేతిలోని జెండాని ఎంపీ లాక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
🥊 In Ankara 🇹🇷, during the events of the Parliamentary Assembly of the Black Sea Economic Community, the representative of Russia 🇷🇺 tore the flag of Ukraine 🇺🇦 from the hands of a 🇺🇦 Member of Parliament.
The 🇺🇦 MP then punched the Russian in the face. pic.twitter.com/zUM8oK4IyN
— Jason Jay Smart (@officejjsmart) May 4, 2023
Also Read..
Prashanth Neel | సలార్ సెట్స్‌లో హ్యాపీ మూడ్‌లో ప్రశాంత్ నీల్ కపుల్.. స్పెషల్ ఇదే
Minister KTR | ఆర్మీ జవాన్ అనిల్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం
MLA Vungzagin Valte | మణిపూర్‌లో బీజేపీ ఎమ్మెల్యేపై దాడి.. విషమంగా పరిస్థితి