Prashanth Neel | సలార్ సెట్స్‌లో హ్యాపీ మూడ్‌లో ప్రశాంత్ నీల్ కపుల్.. స్పెషల్ ఇదే
Prashanth Neel | టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంపౌండ్ నుంచి ప్రస్తుతం మరో పాన్ ఇండియా చిత్రం సలార్ (Salaar). ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా ప్రశాంత్ నీల్‌కు ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు.
Prashanth Neel | కేజీఎఫ్ సినిమాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్‌గా మారిపోయాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel). ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి ప్రస్తుతం మరో పాన్ ఇండియా చిత్రం సలార్ (Salaar) వస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా ప్రశాంత్ నీల్‌కు ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు. ఈ స్పెషల్ డేను కూడా ప్రశాంత్ నీల్ సలార్ సెట్స్‌లోనే గడిపాడు. ఇంతకీ ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా..? నేడు ప్రశాంత్ నీల్ 12వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నాడు.
సలార్ సెట్స్ లో ప్రశాంత్ నీల్-లిఖిత కపుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్న స్టిల్ ఒకటి నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. సూపర్ క్యూట్ కపుల్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్లు, మూవీ లవర్స్. ఫొటో బ్యాక్ డ్రాప్లో బ్లాక్ టీ షర్ట్‌లో ఉన్న వ్యక్తి గురించి తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ఫొటో విజువల్ క్లోజ్‌గా చూసిన అభిమానులు ఆ వ్యక్తి ప్రభాసే అని ఫిక్సయిపోతున్నారు. సలార్ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సలార్ రెండు పార్టులుగా రాబోతుంది.
ఈ సినిమాలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోండగా.. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కేజీఎఫ్ ప్రాంఛైజీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్-విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలిమ్స్ కాంబోలో సలార్ తెరకెక్కుతుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ మరోవైపు జూనియర్ ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ 31కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రభాస్ మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K, మారుతి డైరెక్ట్ చేస్తున్న హార్రర్ కామెడీ, తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో మైథలాజికల్ ప్రాజెక్ట్ ఆదిపురుష్‌లో కూడా నటిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

