Israeli strike | ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గాజా నగరంపై ఇజ్రాయెల్ దళాలు వరుస దాడులను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఉత్తర గాజా పట్టణంలోని బీట్ లాహియాలో గల నివాస భవనంపై ఐడీఎఫ్ జరిపిన దాడిలో 55 మంది పాలస్తీనియన్లు (Palestinians) మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ విషయాన్ని పాలస్తీనా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది.
అనేక మంది బాధితులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. మరణించిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నట్లు స్థానిక మీడియా నివేదించింది. అయితే, ఈ దాడిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. రెండు రోజుల కిందట కూడా బీట్ లాహియాలో ఆరు భవనాలపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల్లో 35 మంది మృతి చెందారు. దీంతో పాటు ఓ ఇంటిపై జరిగిన దాడిలో మరో 10 మంది మృతి చెందగా.. అనేక మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడులతో జబాలియా, బీట్ లాహియా, బీట్ హనౌన్ ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలు అల్లాడుతున్నారని పాలస్తీనియన్ సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది. ఆహారం, వైద్య సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది.
Also Read..
Zeeshan Siddique | జీషన్ సిద్ధిక్, సల్మాన్ ఖాన్కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్
Ayodhya | దీపోత్సవానికి ముస్తాబవుతున్న అయోధ్య.. 28 లక్షల దీపాలతో ప్రపంచ రికార్డుకు సిద్ధం