Ayodhya | దీపోత్సవానికి ముస్తాబవుతున్న అయోధ్య.. 28 లక్షల దీపాలతో ప్రపంచ రికార్డుకు సిద్ధం
Ayodhya | దీపావళి వేడుకలకు (Diwali Celebrations) ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య (Ayodhya) నగరం ముస్తాబవుతోంది.
Ayodhya | దీపావళి వేడుకలకు (Diwali Celebrations) ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య (Ayodhya) నగరం ముస్తాబవుతోంది. ఒకేసారి లక్షలాది దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు (World Record) సిద్ధమైంది. ఏటా దీపావళి పర్వదినానికి ముందు రోజు అయోధ్యలోని సరయూ నదీ తీరంలో (Saryu river bank) ‘దీపోత్సవ్’ (Deepotsav) కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే గతేడాది ఏకంగా 25 లక్షల దీపాలు ఒకేసారి వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. అయితే ఈ ఏడాది 28 లక్షల దీపాలతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాలని యూపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఇందులో భాగంగానే అక్టోబర్ 30న జరిగే దీపోత్సవ్ వేడుకలకు అయోధ్యా నగరి ముస్తాబవుతోంది. సరయూ నదీ తీరంలో దీపోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 51 ఘాట్లలో ఒకేసారి 28 లక్షల దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 30 వేల మంది వాలంటీర్లు ఈ దీపోత్సవం కార్యక్రమంలో భాగం కానున్నారు. ఇక రామ మందిరం నిర్మాణం తర్వాత తొలి సారి జరుగుతున్న దీపావళి పండుగ కావడంతో ఈ దీపోత్సవాన్ని మరింత అద్భుతంగా నిర్వహించాలని యూపీ సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగానే రామ మందిర సముదాయాన్ని పూలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నారు.
బుధవారం సాయంత్రం 6:30 గంటలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. సరయూ హారతి (Saryu Aarti) ఇస్తారు. అనంతరం నది ఒడ్డున దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తూ దీపాలను లెక్కించనున్నారు. ఈ దీపోత్సవానికి అన్ని శాఖల మంత్రులు, ప్రభుత్వ అధికారులు హాజరుకానున్నారు. కార్యక్రమం అనంతరం లేజర్ షో ఏర్పాటు చేశారు.
Also Read..
Air Pollution | ఢిల్లీలో కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. అయినా ప్రమాదకరంగానే ఏక్యూఐ
Washington Post | అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్‌కు ఊహించని షాక్..!
Kerala CM | కేరళ సీఎంకు తప్పిన ప్రమాదం.. కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ.. VIDEO
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

