Zeeshan Siddique | జీషన్ సిద్ధిక్, సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్
Zeeshan Siddique| మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ (Baba Siddique) హత్య తర్వాత ఆయన కుమారుడు, ఎన్సీపీ (అజిత్ పవార్) నేత జీషన్ సిద్ధిక్ (Zeeshan Siddique)కి, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు బెదిరింపు కాల్స్ (Death Threat) వచ్చిన విషయం తెలిసిందే.
Zeeshan Siddique| మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ (Baba Siddique) హత్య తర్వాత ఆయన కుమారుడు, ఎన్సీపీ (అజిత్ పవార్) నేత జీషన్ సిద్ధిక్ (Zeeshan Siddique)కి, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు బెదిరింపు కాల్స్ (Death Threat) వచ్చిన విషయం తెలిసిందే. చంపేస్తామంటూ సదరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ బెదిరింపు కాల్స్ అక్టోబర్ 25వ తేదీన వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ బెదిరింపులపై జీషన్ సిద్ధిక్ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బెదిరింపులకు పాల్పడింది నోయిడాకు చెందిన 20 ఏళ్ల వ్యక్తి మహ్మద్ తయ్యబ్‌గా గుర్తించారు. తాజాగా అతడిని అరెస్ట్ చేశారు.
అక్టోబర్ 17న కూడా బెదిరింపులు..
ప్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ సల్మాన్ ఖాన్‌ను హెచ్చరించారు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్‌కు అక్టోబర్ 17 రాత్రి మెసేజ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ నంబర్ ఎవరిది, మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందని కనుక్కొనే పనిలో పడ్డారు. ఈ కేసులో జంషెడ్‌పూర్‌కు 24 ఏళ్ల కూరగాయల అమ్మకందారుడు షేక్ హుస్సేన్ షేక్ మౌసిన్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఎన్సీపీలో చేరిన జీషన్ సిద్ధిక్..
జీషన్ సిద్ధిక్(Zeeshan Siddique).. అజిత్ పవార్‌కు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆగస్టులో జీషన్‌ను వెలివేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో ఆ చర్య తీసుకున్నది. ఇక త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బాంద్రా ఈస్ట్ నుంచి జీషన్ ఎన్సీపీ టికెట్‌పై పోటీ చేయనున్నారు. 2019 ఎన్నికల్లో ఆ స్థానం నుంచి వరుణ్ సర్దేశాయ్పై పోటీ చేసి గెలిచారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే మేనేల్లుడు వరుణ్‌పై ఆయన విజయం సాధించారు.
Also Read..
Ayodhya | దీపోత్సవానికి ముస్తాబవుతున్న అయోధ్య.. 28 లక్షల దీపాలతో ప్రపంచ రికార్డుకు సిద్ధం
Air Pollution | ఢిల్లీలో కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. అయినా ప్రమాదకరంగానే ఏక్యూఐ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

