Luxury Villa | నోయిడా (Noida)కు చెందిన ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ లగ్జరీ విల్లాలను (Luxury Villa) కొనుగోలు చేసిన వారికి ఇటలీకి చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలి లాంబోర్గిని కారును కాంప్లిమెంటరీ (Free Lamborghini) కింద అందజేయనున్నట్లు తెలిపింది.
నోయిడాలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన జేపీ గ్రీన్స్ (Jaypee Greens).. గ్రేటర్ నోయిడాలో 3 BHK, 4 BHK, 5 BHK, 6 BHK సహా పలు విల్లాలను నిర్మించింది. వీటి ధరలు రూ.51 లక్షల నుంచి రూ.30 కోట్ల వరకూ నిర్ణయించింది. కొనుగోలు దారులను ఆకర్షించేందుకు ఆఫర్‌ను కూడా ప్రకటించారు. ఈ మేరకు రియల్టర్ గౌరవ్ గుప్తా తమ సంస్థ నిర్మించిన అల్ట్రా – ప్రీమియం విల్లాలను కొనుగోలు చేసే వారికి సోషల్ మీడియా వేదికగా బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. రూ.26 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన విల్లాను కొంటే రూ.4 కోట్ల కంటే ఎక్కువ విలువైన కాంప్లిమెంటరీ లాంబోర్గినీ ఉరస్ (Lamborghini Urus)ని ఇవ్వనున్నట్లు తెలిపారు.
Noida’s got a new Villa Project coming up at 26 Cr that’s offering 1 Lamborghini with each of those! 🙄 pic.twitter.com/gZqOC8hNdZ
— Gaurav Gupta | Realtor (@YourRealAsset) October 27, 2024
కాగా, రూ.26 కోట్లు కేవలం బేస్ విల్లాకు మాత్రమే లెక్క. అదనపు సౌకర్యాలతో కలిపి దీని ధర రూ.27 కోట్లకు పైనే ఉంటుంది. బేస్ విల్లా కోసం రూ.26 కోట్లు పెట్టగా.. పార్కింగ్ కోసం రూ.30 లక్షలు, పవర్ బ్యాకప్ కోసం రూ.7.5 లక్షలు, క్లబ్ మెంబర్షిప్ కోసం మరో రూ.7.4 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఇక మీరు గోల్ఫ్ కోర్ట్ వ్యూతో విల్లా కోరుకుంటే మాత్రం మరో రూ.50 లక్షలు అదనంగా పే చేయాల్సి ఉంటుంది. దీంతో ఒక్కో విల్లా ధర రూ.26.95 కోట్ల నుంచి రూ.27.45 కోట్ల వరకూ ఉంటుందన్న మాట. ఇంత ఖర్చు చేస్తే మనకు లాంబోర్గినీ కారు కాంప్లిమెంటరీ కింద ఇస్తారు. రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటించిన ఈ ఆఫర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రియల్టర్ పెట్టిన ట్వీట్స్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Forgot to add 26 Crores don’t cover PLC, Car Parking and Other Charges 🤫 https://t.co/l6ubEArdtq pic.twitter.com/8R9vKnzVMU
— Gaurav Gupta | Realtor (@YourRealAsset) October 28, 2024
Also Read..
Ayodhya | దీపోత్సవానికి ముస్తాబవుతున్న అయోధ్య.. 28 లక్షల దీపాలతో ప్రపంచ రికార్డుకు సిద్ధం
Air Pollution | ఢిల్లీలో కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. అయినా ప్రమాదకరంగానే ఏక్యూఐ
Washington Post | అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్‌కు ఊహించని షాక్..!