ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 17, 2020 , 21:12:59

ఐదుగురు తాలిబన్‌ ఉగ్రవాదులు హతం

ఐదుగురు తాలిబన్‌ ఉగ్రవాదులు హతం

కాబూల్‌ : ఆప్ఘనిస్థాన్‌లోని ఈశాన్య ప్రావిన్స్ కునార్‌లోని దంగం జిల్లాలో ఆఫ్ఘన్ దళాలకు, తాలిబాన్ ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందగా, మరో నలుగురు గాయాలయ్యాయని ఆఫ్ఘన్ సైన్యం తూర్పు విభాగం (201 సెలాబ్ కార్ప్స్‌) తెలిపింది. ఆదివారం రాత్రి ఉగ్రవాదులు ఆఫ్ఘన్ భద్రతా తనిఖీ కేంద్రాలపై దాడి చేశారు. భద్రతా దళాలు ధీటుగా ప్రతిస్పందించడంతో ఐదుగురు తిరుగుబాటుదారులు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఈ దాడిలో ఓ సాధారణ పౌరుడికి సైతం గాయాలయ్యాయని ఆఫ్ఘన్ సైన్యం తూర్పు విభాగం తెలిపింది.  ఘటనపై తాలిబాన్ ఉగ్రవాద సంస్థలేవీ ఇంకా స్పందించ లేదు. ఆఫ్ఘన్ సైన్యం తూర్పు విభాగాన్ని (201 సెలాబ్ కార్ప్స్‌)గా పిలువడం తెలిసిందే.logo