Israeli Women Hostages | ఇజ్రాయెల్- హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్‌కు చెందిన నలుగురు మహిళా సైనికులను (female Israeli soldiers) హమాస్ శనివారం విడుదల చేసింది. ఆ నలుగురిని మిలిటరీ యూనిఫామ్‌లో తీసుకొచ్చి రెడ్‌క్రాస్‌కు (Red Cross members) అప్పగించింది. అనంతరం వారిని ఇజ్రాయెల్‌కు తీసుకెళ్లారు. వీరిని విడుదల చేసినందుకు గానూ ఇజ్రాయెల్ సైతం 100కు పైగా పాలస్తీనియన్లను విడిచిపెట్టింది.
ప్రస్తుతం విడుదలైన మహిళా సైనికులను 2023 అక్టోబర్ 7న గాజా సరిహద్దుకు సమీపంలోని వహల్ ఓజ్ మిలిటరీ బేస్ నుంచి హమాస్ బంధించి తీసుకెళ్లింది. అప్పటి నుంచి 477 రోజులుగా ఆ మహిళా సైనికులు హమాస్ చెరలోనే ఉన్నారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తొలిరోజు గాజా నుంచి ముగ్గురు ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా తమ జైళ్లలో ఉన్న 100 మందికిపైగా పాలస్తీనియనన్లకు విముక్తి కల్పించి వారిని రెడ్‌క్రాస్ సంస్థకు అప్పగించింది. కాగా, 42 రోజుల తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తమ చెరలో ఉన్న 2,000 మందిని ఇజ్రాయెల్ వదిలిపెట్టనుండగా.. హమాస్ సైతం తమ చెరలో ఉన్న 94 మంది బందీల్లో 33 మందికి విముక్తి కల్పించనుంది.
Also Read..
“Gaza Strip | గాజాలో ఘన స్వాగతం.. 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్ “
“Israeli hostages | అమల్లోకి గాజా- ఇజ్రాయెల్ కాల్పులు విరమణ.. ముగ్గురు బందీలను విడుదల చేసిన హమాస్”
“బందీలను విడిచిపెట్టకపోతే అంతు చూస్తా”