Gaza Strip | గాజాలో ఘన స్వాగతం.. 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ఫుల్ పడింది. ఇరు పక్షాలు కాల్పుల విమరణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో చిరకాలంగా ఎదురుచూస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు తమ వద్ద బందీలుగా ఉన్న వారిని విడుదల చేస్తున్నాయి.
గాజా స్ట్రిప్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ఫుల్ పడింది. ఇరు పక్షాలు కాల్పుల విమరణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో చిరకాలంగా ఎదురుచూస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు తమ వద్ద బందీలుగా ఉన్న వారిని విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగా రోమి గోనెన్, ఎమిలీ దామరి, డోరోన్ స్టీన్బ్రెచర్ అనే ముగ్గురు మహిళా బందీలను హమాస్ ఆదివారం విడుదల చేసింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా తమ జైళ్లలో ఉన్న 90 మంది పాలస్తీనియనన్లకు విముక్తి కల్పించింది. వారిని రెడ్క్రాస్ సంస్థకు అప్పగించింది. దీంతో సోమవారం వారు ప్రత్యేక బస్సుల్లో గ్రాజా స్ట్రిప్కు (Gaza Strip) చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి పాలస్తీనా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. వారిని చూసేందుకు భారీ సంఖ్యలు పాలస్తీనియన్లు తరలివచ్చారు. ఇన్నాళ్లు ఇజ్రాయెల్ చెరలో ఉన్న తమ వారిని చూసుకుని కుటుంబ సభ్యులు కంటతపడిపెట్టారు.

కాగా, ఒప్పందంలో భాగంగా తొలి విడతగా ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. తర్వాత విడతల వారీగా మొత్తం 2,000 మందిని వదిలిపెడుతుంది. హమాస్ కూడా ఇప్పటికే ముగ్గురిని విడుదల చేయగా, రానున్న ఆరు వారాల్లో మిగిలిన 33 మందిని కూడా వదిలివేయనున్నట్టు ప్రకటించింది.

అంతకు ముందు 42 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం అమలును హమాస్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభించింది. ఒప్పందం అమలు కొన్ని గంటలు ఆలస్యం కావడంతో ఈలోగా ఖాన్యూనిస్ నగరం దక్షిణ భాగంపై ఇజ్రాయెల్ వాయుసేన దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో 26 మంది మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సాంకేతిక క్షేత్ర కారణాల వల్లే ఒప్పందం అమలు ఆలస్యమైనట్టు హమాస్ పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.

కాగా, కాల్పుల విరమణ నేపథ్యంలో మానవతా సహాయన్ని అందించేందుకు గాజా స్ట్రిప్కి భారీగా ట్రక్కులు చేరుకుంటున్నాయి. సుమారు 630కిపైగా ట్రక్కుల్లో పెద్దమొత్తంలో నిత్యావసర సరుకులతోపాటు వివిధ వస్తువులు వచ్చాయని ఐక్యరాజ్యసమితి అధికారులు వెల్లడించారు. వాటిలో 300 ట్రక్కులు గాజాకు ఉత్తరాది నుంచి చేరుకున్నాయని చెప్పారు.

గాజాకు తిరిగి వస్తున్న పౌరులు
యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో ఆదివారం పౌరుల సంబరాలు మిన్నంటాయి. యుద్ధ భయంతో 15 నెలల క్రితం ఇళ్లు, ఆస్తులను వదిలి బతుకు జీవుడా అంటూ వెళ్లిపోయిన లక్షలాది మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లకు తిరిగి రావడం ప్రారంభించారు. ఒక పక్క కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభం కాలేదు, మరో పక్క ఇజ్రాయెల్ తన వాయుసేన దాడులు కొనసాగిస్తూనే ఉంది, అయినా లక్ష్యపెట్టక వేలాది మంది పౌరులు కాలినడక, గాడిదలు లాగే బండ్లపై గాజాకు చేరుకోవడం కన్పించింది.

పునరుద్ధరణకు దశాబ్దాల కాలం
15 నెలల పాటు సాగిన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 46 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వారిలో సగం మంది మహిళలు, పిల్లలే. 1.10 లక్షల మంది గాయపడ్డారు. 23 లక్షల మంది ఉన్న జనాభాలో 19 లక్షల మంది దేశం వదిలి శరణార్థులుగా మారారు. ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల వర్షానికి భవనాలు, ఇళ్లు శిథిలాలుగా మారాయి. 69 శాతం ఆస్తులు ధ్వంసం అయినట్టు ఐక్యరాజ్య సమితి గత నెలలో అంచనా వేసింది. వీటిని పునరుద్ధరించడానికి కొన్ని దశాబ్దాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. పేరుకుపోయిన శిథిలాలను తొలగించడానికే 15 ఏండ్లు పడుతుందని తెలిపారు. కాగా, 2014లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మరణించిన తమ సైనికుడు ఓరన్ సాహుల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ ఒక ప్రకటనలో తెలిపింది.


Palestina 7





Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

