వాషింగ్టన్, జూన్ 8 : తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే బందీలందరినీ హమాస్ విడుదల చేయని పక్షంలో పశ్చిమాసియాలో అల్లకల్లోలం సృష్టిస్తామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. బుధవారం ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ జనవరి 20న అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టడానికి ముందుగానే బందీలందరూ వాపసు రాని పక్షంలో హమాస్ అంతుచూస్తానని హెచ్చరించారు. కొందరు అమెరికన్ పౌరులతోసహా దాదాపు 100 మందిని 2023 అక్టోబర్ 7 హమాస్ బందీలుగా చేసుకుంది. గాజాలో అప్పటి నుంచి బందీలుగా ఉన్న వీరిలో చాలా మంది మరణించి ఉండవచ్చని అమెరికా అధికారులు భావిస్తున్నారు. జనవరి 20లోగా బందీలు అందరినీ హమాస్ విడుదల చేయాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు.