Morocco | ఆఫ్రికా దేశమైన మొరాకో (Morocco) ను భారీ భూకంపం (Earthquake) కుదిపేసింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మొరాకోలోని మర్రకేష్ (Marrakesh) ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి 296 మంది బలైనట్లు తెలిపింది. మరో 153 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు పేర్కొంది.
మర్రకేష్కు 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని.. భూ అంతర్భాగంలో 18.5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. ఆల్ హౌజ్, మర్రకేష్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రావిన్సుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించింది. శతాబ్దకాలంలో ఉత్తరాఫ్రికా ఈ స్థాయి భూకంపాన్ని ఇప్పటి వరకూ చవిచూడలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
మరోవైపు భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
#WATCH 👇
Security camera captured the horrible 😱moment a building collapsed during an #earthquake in #Morocco.
296 dead😨💔
I pray for the safety of the people there🙏#MoroccoEarthquake #EarthquakeMorocco #G20India2023 #ViralVideo #ChandrababuNaidu #BharatMandapam #TeJran pic.twitter.com/4wuK0FJS2T— Anveshka Das (@AnveshkaD) September 9, 2023
Fas’ta 7
Yüzeye çok yakın olduğundan şiddeti daha büyük bir depremmiş gibi hissedildi.
Allahtan burada oteller ve bazı özel izinli binalar haricinde 5 katın üzerine bina inşaatına izin yok#deprem #morocco #marrakech #earthquake #Marrakesh pic.twitter.com/jt7da3WKAW— LSE (@LseSbl) September 9, 2023
Also Read..
Reserve Day: ఇండోపాక్ మ్యాచ్కు రిజర్వ్ డే.. ఓకే చెప్పిన బంగ్లా, లంక క్రికెట్ బోర్డులు