Pakistan | పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీయే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి (Suicide Attack) పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 23 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa province) లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ (Dera Ismail Khan) జిల్లాలోగల ఆర్మీ బేస్‌పై మంగళవారం తెల్లవారుజామున ఆత్మాహుతి దాడి (Suicide Bombing Attack) ఘటన జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఆత్మాహుతి బాంబర్లు సెక్యూరిటీ కాంపౌండ్‌లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దులోని గిరిజన ప్రాంతాలకు సమీపంలో జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్‌కు చెందిన తెహ్రీక్-ఏ-జిహాద్ పాకిస్థాన్ (TJP) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
Also Read..
RTC bus | పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు
Raj Bhavan | కర్ణాటక రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన అధికారులు
Mahua Moitra | మహువా 30 రోజుల్లోగా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలి : పార్లమెంట్ హౌసింగ్ కమిటీ