గురువారం 28 మే 2020
International - Apr 13, 2020 , 11:56:20

అక్కడ కరోనా తగ్గుతున్నది

అక్కడ కరోనా తగ్గుతున్నది

యూరప్ ఖండంలో కరోనా మహమ్మారికి కేంద్రంగా మారిన ఇటలీలో వ్యాధి తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు. మార్చి 19 తర్వాత మొదటిసారి ఆదివారం దేశంలో కరోనా మరణాలు తగ్గాయి. ఆదివారం దేశవ్యాప్తంగా 431 మంది మరణించారు. గత మూడువారాల్లో ఇవే అతితక్కువ మరణాలు. ఆదివారం నాటికి మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 19,99కి చేరింది.

కరోనా మరణాల్లో ప్రపంచంలో అమెరికా తర్వాత ఇటలీ రెండోస్థానంలో ఉంది. ఇక్కడ వ్యాధితో అత్యవసర వైద్యసేవలు పొందుతున్నవారి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టిందని ఇటలీ సివిల్ ప్రొటెక్షన్ సర్వీస్ డైరెక్టర్ ఆంజెలో బొరెల్లీ తెలిపారు.  


logo