లండన్: వలసదారుల విషయంలో యూకే ప్రభుత్వం కఠినమైన ఆంక్షలకు తెరలేపింది. వీసా గడువు దాటి తమ దేశంలో ఉంటున్న 20,706 మంది భారతీయులను స్వదేశానికి పంపుతామంటూ హెచ్చరికలు జారీచేసింది. యూకే హోం మంత్రి షబానా మహమూద్ తమ దేశంలో ఉంటున్న భారతీయులు, పాకిస్థానీలు, నైజీరియన్లకు హెచ్చరికలు జారీ చేశారు.
ఆయా దేశాలు బ్రిటన్లోని అక్రమ వలసదారులను తిరిగి తీసుకోవడానికి నిరాకరిస్తే లేదా ఆలస్యం చేస్తే కొత్త వీసా ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని మహమూద్ హెచ్చరించారు. ఆయా దేశాలతో దౌత్యపరమైన ఉద్రిక్తతలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె చెప్పారు.