Firecracker Factory | థాయ్లాండ్ (Thailand)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ సుఫాన్ బురి ప్రావిన్స్ (central Suphan Buri province)లో గల సాలా ఖావో టౌన్షిప్ (Sala Khao township) సమీపంలోని ఓ బాణాసంచా కర్మాగారం (Firecracker Factory)లో భారీ పేలుడు (explosion) సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పేలుడు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని చెప్పారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read..
Ram Mandir | రాజనీతి కాదు ధర్మనీతి.. ప్రతిపక్షాల విమర్శలపై రామమందిరం ప్రధాన పూజారి స్పందన
Jallikattu | జల్లికట్టు పోటీల్లో అపశృతి.. ఇద్దరు మృతి
Stray dogs | భోపాల్లో వీధికుక్కల వీరంగం.. ఒక్కరోజే 40 మందిపై దాడి