Stray dogs | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్ (Bhopal)లో వీధి కుక్కలు (Stray dogs) వీరంగం సృష్టించాయి. ఒక్కరోజే ఏకంగా 40 మందిపై దాడి చేసి గాయపరిచాయి. కుక్కల దాడిలో గాయపడిన వారంతా టీకా కోసం ఆసుపత్రులకు క్యూ కట్టారు.
భోపాల్ నగరంలో మంగళవారం వీధి కుక్కలు హల్చల్ చేశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకంగా 40 మందిపై దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారు.. రేబిస్ టీకా కోసం ఆసుపత్రుల వద్ద క్యూ కట్టినట్లు అధికారులు తెలిపారు. జనవరి మొదటి వారంలో కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో కుక్కకాటుకు సంబంధించిన కేసులు డజనుకు పైగా నమోదైనట్లు చెప్పారు.
ఇక జనవరి 10న భోపాల్‌లో ఏడు నెలల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను పట్టుకునే కార్యక్రమాన్ని ముమ్మురం చేశారు. తాజాగా 40 మందిని కుక్కలు కరవడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో భోపాల్ నగర మేయర్ మల్తీ రాయ్ మంగళవారం సాయంత్రం కార్పొరేషన్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భోపాల్‌లోని కజ్లిఖేడా, అర్బలియా, అడంపూర్ కంటోన్మెంట్లలోని ఏబీసీ సెంటర్లలో రోజూ 30 కుక్కలకు స్టెరిలైజ్ చేస్తున్నట్లు అధికారులు మేయర్‌కు తెలిపారు.
Also Read..
Lalu Yadav | ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లడం లేదు : లాలూ యాదవ్
Governor Tamilisai | గవర్నర్ తమిళిసై ఎక్స్ అకౌంట్ హ్యాక్
Virat Kohli | విరాట్ దంపతులకు అందిన రాముడి ప్రాణ ప్రతిష్ట ఆహ్వానం.. ఫొటో వైరల్