Jallikattu | తమిళనాడు (Tamil Nadu)లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన జల్లికట్టు (Jallikattu) పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. శివగంగ జిల్లాలో (Sivaganga district) జరిగిన పోటీల్లో ప్రమాదవశాత్తు ఓ మైనర్ సహా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పోటీలను వీక్షిస్తుండగా ఎద్దుల మధ్య నలిగి వారు ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టు (Jallikattu). పొంగల్ వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ సంప్రదాయం పురాతన కాలం నుంచి కొనసాగుతోంది. ఈ జల్లు కట్టు ఉత్సవాలను చూసేందుకు ఏటా దేశ విదేశాల నుంచి కూడా జనం భారీగా తరలివస్తారు. ఎద్దులను బరిలోకి వదిలి.. వాటిని లొంగదీసుకోవడం అనేది ఈ క్రీడలోని ప్రధానమైన అంశం. ఎద్దులను లొంగదీసుకునేందుకు యువకులు చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ ఉత్సవంలో పలువురు తీవ్ర గాయాలపాలవుతుంటారు. అయినా ఈ ఉత్సవాలకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
Also Read..
Ayodhya Ram Mandir | ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి చంద్రబాబుకు అందిన ఆహ్వానం
Indian Students | కెనడాతో వివాదం.. ఆ దేశానికి వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 86 శాతం తగ్గుదల
Stray dogs | భోపాల్లో వీధికుక్కల వీరంగం.. ఒక్కరోజే 40 మందిపై దాడి