Indian Students | కెనడాతో వివాదం.. ఆ దేశానికి వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 86 శాతం తగ్గుదల
Indian Students | భారతీయ విద్యార్థులకు (Indian Students) ఇచ్చే స్టడీ పర్మిట్ల (study permits) సంఖ్యను కెనడా భారీగా తగ్గించింది.
Indian Students | ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారతీయ ఏజెంట్లే కారణమంటూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో నిరాధార ఆరోపణలతో ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. తాజాగా భారతీయ విద్యార్థులకు (Indian Students) ఇచ్చే స్టడీ పర్మిట్ల (study permits) సంఖ్యను కెనడా భారీగా తగ్గించింది.
గతేడాది నాలుగవ త్రైమాసికంలో భారతీయ విద్యార్థులకు కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్ల సంఖ్య.. అంతక్రితం త్రైమాసికంతో పోల్చితే ఏకంగా 86 శాతం తగ్గుదల నమోదయింది. గతేడాది డిసెంబర్లో కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్లను కేవలం 14,910 మందికి మాత్రమే అనుమతులిచ్చినట్లు కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ (Marc Miller) తాజాగా తెలిపారు. అంతకుముందు త్రైమాసికంలో ఆ సంఖ్య 1,08,940గా ఉంది. గతంతో పోలిస్తే ఆ సంఖ్య దాదాపు 86 శాతానికి పడిపోయినట్లు మార్క్ చెప్పారు.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే భారతీయ విద్యార్థులు ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పలు యూరప్ దేశాల్లోని కాలేజీలను ఎంచుకొంటుంటారు. ఇక కెనడాలో విద్యనభ్యసించడానికి వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే సింహభాగం. కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రకారం.. 2022లో కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్లలో భారతీయ విద్యార్థుల వాటా ఏకంగా 41 శాతంగా ఉంది. 2022లో ఏకంగా 225,835 మంది భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు లభించాయి. అయితే ఖలిస్థాన్ ఉగ్రవాది హత్యతో కెనడా, భారత్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత విద్యార్థులు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు.
Also Read..
Iran Attacks | పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్ దాడి.. తీవ్రంగా ఖండించిన పాక్
Salt | ఉప్పు ప్రాణానికి ముప్పు.. పరిమితికి మించి వాడకంతో ఏటా 18.9 లక్షల మంది మృతి
ప్రపంచంలోనే తెలివైన విద్యార్థుల్లో మన ‘చక్రవర్తి’
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
నేరాల అదుపునకు అంకిత భావంతో పని చేయాలి : డీఎస్పీ రవి
‘ఏఐకేఎస్ మహా సభలను జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

